SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో మే 20, 2022న విడుదలైన సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 10 వారాల పాటు ట్రెండ్ అయిన ఏకైక నాన్ ఇంగ్లీష్ చిత్రంగా మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa