ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ్ రామ్ "బింబిసార" పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 12:56 PM

నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తొలి హిస్టారికల్ ఎంటర్టైనర్ "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఇందులో క్యాథెరిన్ థెరెస్సా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తుండగా, పాటలను చిరంతన్ భట్ కంపోజ్ చేసారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, బింబిసార రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తుంది. 2 గంటల 26 నిమిషాల డీసెంట్ రన్ టైం తో విడుదల కానున్న ఈ సినిమా ఇంకా సెన్సార్ పూర్తి చేసుకోలేదు. జూలై 29వ తేదీన జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతుండడంతో, నందమూరి అభిమానులు ఈ ఈవెంట్ కోసం వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa