తెలుగు సినిమా డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. కొందరు షూటింగ్ స్పాట్‌లోనే డైలాగులు రాస్తున్నారని, ఇది నటులకు ఇబ్బందికరంగా ఉందని అన్నారు. డైలాగులు చదవడానికే నటులకు చాలా సమయం పడుతుందని, నటనపై ఎలా దృష్టిపెట్టగలరని ప్రశ్నించారు. తనకు కూడా ఇలాంటి అనుభవం చాలా సార్లు ఎదురైందన్నారు.