ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న చిత్రం "సీతారామం". దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మీక మండన్నా కీరోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఈ సినిమాలో సుమంత్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి వరసగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ల ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో నటిస్తున్న ప్రముఖ సపోర్టింగ్ ఆర్టిస్ట్ మురళీశర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa