ఇప్పటి వరకు 9 మందితో డేటింగ్ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ప్రస్తుతం లలిత్ మోడీతో ప్రేమలో విహరిస్తోంది. తానింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 3 సార్లు తాను పెళ్లికి సిద్ధమైనట్లు పేర్కొంది. తన జీవితంలో చాలా మంది మగవారిని కలిశానని, అయితే వారిలో నెలకొన్న నిరుత్సాహం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలిపింది. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.