టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఇటీవలే "భళా తందనానా" సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. తదుపరి శ్రీవిష్ణు "అల్లూరి" అనే పవర్ఫుల్ కాప్ స్టోరీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ తో విష్ణు బిజీగా ఉన్నాడు.
లేటెస్ట్ గా ఈ రోజు ఉదయం శ్రీవిష్ణు ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తుంది. కొన్ని రోజుల నుండి వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్న శ్రీవిష్ణు ఈ రోజు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ప్లేట్ లెట్ కౌంట్ తగ్గినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శ్రీవిష్ణు త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa