అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబాటింది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. F3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ సోనీ LIV, నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఈరోజు నుండి సోనీ LIV లో, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa