చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కార్తికేయ 2' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది. తాజాగా నిఖిల్, శ్రీనివాస రెడ్డి, హర్ష చెముడు తదితరులు ఉత్తరప్రదేశ్‌లోని ఇస్కాన్ బృందావనాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ఇస్కాన్ బృందావన్ సహ-అధ్యక్షుడు రాధా గోలోకానంద స్వామి ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయమని నిఖిల్‌ను కోరారు. అందుకు హీరో నిఖిల్ కూడా ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా చూడొచ్చు అని సమాధానమిచ్చారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa