ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామోజీరావు గారికి "థాంక్యూ" డైరెక్టర్ స్పెషల్ థాంక్యూ ... ఎందుకంటే?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 04:10 PM

అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా జంటగా, విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీ "థాంక్యూ". దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
థాంక్యూ ప్రమోషన్స్ లో భాగంగా ఒక కాంటెస్ట్ జరుగుతుంది. అదేంటంటే, జీవితంలో ఎవరికైతే మనం ఎక్కువగా రుణపడిపోయి ఉన్నామో, ఎవరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నామో వారి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి, థాంక్యూ చెప్పాలి. ఈ మేరకు చైతూ తన పేరెంట్స్ కి, పెంపుడు కుక్కకి థాంక్యూ చెప్పాడు. డైరెక్టర్ విక్రమ్ తనకు మొదటి సినిమా "ఇష్టం" ను డైరెక్ట్ చేసే సువర్ణావకాశాన్నిచ్చిన నిర్మాత రామోజీరావు గారికి కృతజ్ఞతలను తెలిపాడు. దాదాపు 26 ఏళ్ళున్న ఒక కుర్రవాడిని నమ్మి రామోజీరావుగారు ఇష్టం సినిమా ఛాన్స్ ఇచ్చారంటే, కొత్తరక్తాన్ని ఆయన ఎంతగా ప్రోత్సహిస్తారో అర్ధమవుతుంది.
చంద్రన్, శ్రేయా శరణ్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "ఇష్టం". 2001 లో విడుదలైన ఈ చిత్రం హీరోయిన్ శ్రేయాకు టాలీవుడ్ డిబట్ మూవీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa