హాలీవుడ్ స్టార్స్ బెన్ అఫ్లేక్, జెన్నిఫర్ లోపేజ్ వివాహం చేసుకున్నారు. అమెరికాలోని నేవడాలో వీరి వివాహం జరిగింది. ఇది జెన్నిఫర్ లోపేజ్ కి నాలుగో వివాహం కాగా, అఫ్లేక్ కి రెండోది. ఇక వీరిద్దరూ 2002 లోనే రిలేషన్ షిప్ లో ఉన్నారు.
అదే ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ విభేదాల కారణంగా పెళ్లికి ముందే విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు వ్యక్తులని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వివాహ బంధంతో కలిశారు.