ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న రామ్ 'ది వారియర్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 04:12 PM

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, లింగుస్వామి దర్శకత్వంలో "వారియర్" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి అండ్ అక్షర గౌడ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. జులై 14, 2022న ఈ సినిమాని థియేటర్లలో విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ది వారియర్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా 155 నిమిషాల రన్‌టైమ్ ని కలిగి ఉంది అని వెల్లడించారు. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa