అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో చై తన స్కూల్ డేస్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమానిగా కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా జూలై 22న భారీగా విడుదల కానుంది. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa