టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం "ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ఈ మూవీ ఫస్ట్ విజువల్స్ ను రిలీజ్ చెయ్యగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏ సినిమా చెయ్యాలి ?, ఏ పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది? అన్న విషయంలో, ఎన్ని సంవత్సరాల అనుభవమున్న నటుడికైనా సరైన క్లారిటీ ఉండదని, ఒక సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ కేవలం ప్రేక్షకుడి మైండ్ సెట్ బట్టి ఉంటుందని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా తను చేసిన కొన్ని సినిమాలను పేర్కొన్నారు.
రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగార్జున నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం "అన్నమయ్య" సినిమాలో తాను నటించనని, నిన్నే పెళ్ళాడతా వంటి రొమాంటిక్ సినిమా తర్వాత ఇలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరని చెప్పినా రాఘవేంద్రరావు పట్టుబట్టి మరీ తన చేతనే చేయించారని, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. అలానే శివ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను తనకిచ్చిన RGV డైరెక్షన్లోనే ఆఫీసర్ సినిమా చేసానని, దాని ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది? ఏది నచ్చదు? అనే విషయంపై సరైన అవగాహన ఉంటే శివ, నిన్నే పెళ్ళాడతా, అన్నమయ్య వంటి హిట్ సినిమాలే చేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa