ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కాఫీ విత్ కరణ్" ఫస్ట్ ఎపిసోడ్ కు రికార్డు వీక్షణలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 04:01 PM

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన కరణ్ జోహార్ బుల్లితెరపై చేస్తున్న టాక్ షో "కాఫీ విత్ కరణ్". 2004లో ప్రారంభమైన ఈ టాక్ షో 2019 వరకు స్టార్ వరల్డ్, స్టార్ వన్ ఛానెళ్లలో నిర్విరామంగా ప్రసారం చేయబడింది. నటీనటులు వారి కొత్త సినిమా విడుదలయ్యే తరుణంలో ఈ టాక్ షోలో పాల్గొని కాఫీ తాగుతూ సినిమా ముచ్చట్లను చెప్పుకుంటారు. బాలీవుడ్ లో ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది.
ఈ టాక్ షో లేటెస్ట్ సీజన్ జూలై 7వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ లో భాగంగా, చాన్నాళ్ల తర్వాత కరణ్ డైరెక్ట్ చేసున్న "రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని" హీరో హీరోయిన్లైన రణ్ వీర్ సింగ్, ఆలియాభట్ పాల్గొన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొదటి రోజు వ్యూస్ హిస్టరీలో ఈ ఎపిసోడ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా రాబోయే ఎపిసోడ్ లలో సమంత, విజయ్ దేవరకొండ, అనన్యా వంటి స్టార్లు పాల్గొనబోతుండడంతో ఈ షో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa