ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలోకి చిరు? బలమైన వెబ్ సిరీస్ కోసం గాలింపు...!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 05:14 PM

సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, వాటి షూటింగులలో పాల్గొంటూ, ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చిరు చేతిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి.
ఈ సినిమాలతో పాటుగా ఇంకొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. సో... మెగాస్టార్ క్షణం కూడా ఖాళీ లేని బిజీ షెడ్యూల్ లో లాక్ అయిపోయారు. ఈ బిజీ షెడ్యూల్ లో చిరు ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు.
తన తోటి హీరోలైన రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్ వంటి సీనియర్ హీరోలు ఇప్పటికే డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరి దారిలోనే చిరు కూడా పయనించాలని నిర్ణయించుకున్నాడట. సినిమాలతో పాటుగా మంచి కంటెంట్ ఉన్న ఒక వెబ్ సిరీస్ ను చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. బలమైన కథాకథనాలు, మంచి డైరెక్టర్ ఉంటే, నెగిటివ్ రోల్ లో నటించడానికి కూడా రెడీ గా ఉన్నారని తెలుస్తుంది. ఈ మేరకు తన ప్రొడక్షన్ హౌసైన కొణిదెల ద్వారా కొన్ని ఓటిటిలతో డీల్ మాట్లాడుతున్నారంట. అన్నీ కుదిరితే, త్వరలోనే ఈ విషయంపై అధికారిక క్లారిటీ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa