ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు నుండి నాని "దసరా" కొత్త షెడ్యూల్ ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 05:14 PM

నాచురల్ స్టార్ నాని తొలిసారి నటిస్తున్న పక్కా యాక్షన్ సినిమా, తొలి పాన్ ఇండియా సినిమా "దసరా". కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఫుల్ మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈరోజే ప్రారంభమయ్యింది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని, దర్శకుడు స్క్రిప్ట్ ను తిరగ రాస్తున్నాడని, బడ్జెట్ ప్రాబ్లెమ్ అని...ఇలా పలు రకాల రూమర్స్ మీడియాలో హల్చల్ చేస్తున్న వేళ తాజాగా రిలీజైన పోస్టర్ ఈ వార్తలన్నిటిని ఒత్తి పుకార్లే అని కొట్టిపారేసినట్టయ్యింది. 
ఈ సినిమాలో కీర్తి సురేష్ కధానాయిక గా నటిస్తుండగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa