జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షలను అలరిస్తుంటారు నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆయన నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం బింబిసార. ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్ ను శుక్రవారం సాయంత్రం 5.09 ఇవ్వనున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఇది పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. కొత్త దర్శకుడు వశిష్ఠ దీన్ని తెరకెక్కించనున్నారు.