టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఈరోజే "పక్కా కమర్షియల్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తదుపరి తనకు లౌక్యం వంటి బిగ్ హిట్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
అయితే తాజాగా ఆయన మరో యాక్షన్ ఓరియెంటెడ్ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చిత్రవర్గ సమాచారం. తమిళ దర్శకుడు హరి చెప్పిన ఆ యాక్షన్ స్టోరీ గోపీచంద్ కు బాగా నచ్చిందట. దీంతో వెంటనే ఆ సినిమాకి ఒకే చెప్పేసారంట గోపీచంద్. భగవాన్ పుల్లారావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందట.
ఈ విషయం పక్కన పెడితే, ఈమూవీ స్టోరీ గతంలో హరి జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించిన స్టోరీ అని లేటెస్ట్ టాక్. విక్రమ్ తో సామి, సూర్య తో సింగం సిరీస్ చిత్రాలతో క్రేజీ డైరెక్టర్ గా పేరు పొందిన హరి, కొన్నాళ్లుగా ఫామ్ లో లేరు. అలాంటి హరి ఆమధ్య తారక్ కు ఒక యాక్షన్ స్టోరీ చెప్పారంట. కానీ, డేట్స్ ఎడ్జస్ట్ చెయ్యలేక తారక్ ఆ సినిమాను వద్దనుకోగా, ఇప్పుడదే స్టోరీతో హరి గోపీచంద్ తో సినిమా పట్టాలెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa