ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2' హిందీ వెర్షన్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన నిఖిల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 04:16 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కార్తికేయ 2' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ చిత్రం తెలుగు మరియు హిందీలో జూలై 22, 2022న థియేటర్లలో విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 హిందీ వెర్షన్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఒక ఫోటోను షేర్ చేసి ఈ యంగ్ హీరో ప్రకటించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa