సినీ, రాజకీయ, క్రీడా తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన పలువురు సెలబ్రిటీల జీవితగాధలను ప్రజలందరికి తెలియచేసేలా సినిమాలు తీస్తున్నారు కొంతమంది దర్శకులు. మరి కొంతమందేమో ఆయారంగాల్లో స్కామ్ లు, దొంగతనాలు చేసేవారిపై సినిమాలు తీస్తున్నారు. రవితేజ కొత్త సినిమా "టైగర్ నాగేశ్వరరావు" ఈ కోవలోకే వస్తుంది.
టైగర్ నాగేశ్వరరావు ఒకప్పుడు స్టూవర్టుపురం గజదొంగ. ఇప్పుడు ఈయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన అధికారికంగా వచ్చినప్పటి నుండి కొంతమంది యూట్యూబర్లు టైగర్ నాగేశ్వరరావుపై ఆరా తీయడం మొదలెట్టారు.
ఈ క్రమంలో టైగర్ నాగేశ్వరరావుతో పాటు లూటీ చేసిన ఆయన స్నేహితులను ఇంటర్వ్యూలు చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో వారు నాగేశ్వరావు తో కలిసి ఎన్ని దొంగతనాలు చేసారు? ఎలా చేసారు? ప్రపంచానికి తెలియని, పొలిసు రికార్డులకెక్కని కొత్త కొత్త విషయాలను చెప్తుండడంతో ఈ వీడియోలకు వ్యూస్ బాగా వస్తున్నాయి.
కానీ, ఒక విషయం ఆలోచిస్తే, ఇలాంటి వారి గురించి తెలుసుకోవడం పట్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉంది? అన్న ప్రశ్న మొదలవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa