ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ స్టార్ హీరో బ్లడ్ గ్రూప్ "యూ/ఏ" అంట..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 04:07 PM

సినిమానే జీవితం, సినిమానే ప్రాణంగా భావించే వారు చిత్రసీమలో చాలామంది ఉంటారు. కానీ, ఒక స్టార్ హీరో మాత్రం తన శరీరంలో ప్రవహించే రక్తం కూడా సినిమా బ్లడ్ గ్రూప్ అని చెప్తూ సినిమాపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా తెలిపి వార్తల్లో నిలిచాడు.
సాధారణముగా రక్తంలో ఏ, బి, వాటి అనుబంధ గ్రూపులు ఉంటాయి. కానీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తన బ్లడ్ గ్రూప్ "యూ/ఏ" అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రఖ్యాత కపూర్ల కుటుంబంలో పుట్టిన రణ్ బీర్ పుట్టినప్పటి నుండి సినిమా వాతావరణానికి దగ్గరగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పాడు. అలానే సినిమాలో హీరో ఎంట్రీ సీన్ కి ప్రేక్షకులు విజిల్స్ కొట్టడం, హీరో చెప్పే పవర్ఫుల్ డైలాగులకు చప్పట్లు కొట్టడం, హీరో విలన్ ని కొడుతున్నప్పుడు వచ్చే సౌండ్ తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
పోతే..., త్వరలోనే తండ్రి కాబోతున్న రణ్ బీర్ ఈ నెల్లో షంషేరా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa