ఒకప్పటి మిస్ యూనివర్స్, నటి సుస్మితాసేన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలను తెలిపింది. ఆమె ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని వారిని కన్న బిడ్డల్లా పెంచుతోంది. పెళ్లి చేసుకొని గజిబిజి జీవితంలో పడబోయే తనను ఆ దేవుడే కాపాడాడని సుస్మితా పేర్కొంది. తన జీవితంలో కలిసిన ఓ వ్యక్తి పూర్తిగా నిరాశపరచిన కారణంగా పెళ్లిపై ఆసక్తి లేదని వివరించింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ రోమాన్ షాల్ కు ఈమె బ్రేకప్ చెప్పింది.