మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా డైరెక్షన్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 8వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది.
రెండ్రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది. ఈ డార్క్ ఫాంటసీ కామెడీ ట్రైలర్ సూపర్ ఫన్ గా ఉండడంతో యూట్యూబులో వీక్షణల వెల్లువ వెల్లివిరుస్తుంది. ఇప్పటివరకు 3.5 మిలియన్ల మంది ఈ ట్రైలర్ ను చూసి ఎంజాయ్ చేసారు. దీంతో ఈ సినిమా థియేటర్లలో ఇంకెలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa