గతేడాది విడుదలై దేశవ్యాప్త ప్రభంజనం సృష్టించిన సినిమా పుష్ప. సుకుమార్ డైరెక్షన్లో అల్లుఅర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలై, విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ పుష్ప ది రూల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ సినిమాపై ఒక్క అధికారిక ప్రకటన రాకపోవడంతో, బన్నీ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.
తాజాగా పుష్ప మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 3,4,5 తారీఖుల్లో, తిరుపతి లో "పుష్ప :ది రూల్" కు సంబంధించిన నటీనటుల ఆడిషన్ జరుగుతుందని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మేరకు తిరుపతి, న్యూ బాలాజీ కాలనీ లోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆడిషన్స్ జరుగుతాయని తెలిపారు. ముఖ్య గమనికగా చిత్తూరు యాస వచ్చి ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పుష్ప సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. దీంతో బన్నీ అభిమానులు సూపర్ ఎక్సయిటింగ్ గా ఫీల్ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa