ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం "విరాటపర్వం". దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. తెలంగాణాలోని కొంతమంది నక్సల్స్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకర్శించలేకపోయింది. దీంతో విడుదలైన రెండు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చింది.
నేటి నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై సాయిపల్లవి ఎమోషనల్ నోట్ ను షేర్ చేసుకుంది. వెన్నెల పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉందని, తనకు దక్కిన మంచి పాత్రల్లో ఇదొకటని, జీవితాంతం గుర్తుండిపోయే పాత్రల్లో ఇదొకటని చెప్పింది. ఈ సందర్భంగా చిత్రబృందం మొత్తానికి కృతజ్ఞతలను తెలియచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa