ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని "దసరా" మూవీ పై లేటెస్ట్ అప్డేట్..

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 06:53 PM

నాచురల్ స్టార్ నాని ఇటీవలే "అంటే సుందరానికి" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నజ్రియా నాజిమ్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతున్న ఈ మూవీ ఓవర్సీస్ లో మాత్రం దూసుకుపోతుంది.
అంటే సుందరానికి మూవీ తర్వాత గోవా వెకేషన్ కెళ్ళొచ్చిన నాని వెంటనే దసరా షూటింగ్ లో పాల్గొన్నాడట. తాజాగా ఈ సినిమా పై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.., దసరా షూటింగ్ ఆగిపోయిందని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ ను రీ రైట్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఐతే, శ్రీకాంత్ ఈ వార్తలను చదివి ఊరుకోకుండా, ఎవరైతే ఈ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారో వారికి ట్వీట్ రూపంలో గట్టి కౌంటర్ ఇచ్చాడు. బ్రహ్మానందం చిప్స్ తింటున్న గిఫ్ ను పోస్ట్ చేసి, సదరు పుకారు సృష్టించిన వ్యక్తికి ట్యాగ్ చేసారు. ఈ సెటైరికల్ ట్వీట్ దసరా సినిమా ఆగిపోలేదని చెప్పకనే చెప్తుంది.
పక్కా మాస్ మసాలా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం గళ్ళ లుంగీ, గుబురు గడ్డం, దట్టమైన జుట్టు, కోరమీసాలను పెంచిన నాని పక్కా మాస్ అవతార్ లో కనిపిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa