గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అధికారకనగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'వెందు తనింధతు కాదు' అనే టైటిల్ ని మోవిఓఏ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శింబు సరసన ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 15, 2022న థియేటర్లలో విడుదల కానుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, సిద్దిక్, నీరజ్ మాధవ్, ఏంజెలీనా అబ్రహం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. VELS ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్‌పై డా. ఇషారి కె గణేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa