ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB 28: జూలై మొదటి వారంలో స్క్రిప్ట్ ఫైనలైజేషన్!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 01:01 PM

సర్కారువారిపాట సినిమా థియేటర్లలో అలా విడుదలైందో లేదో..ఇలా మహేష్ ఫ్యామిలీ తో కలిసి విదేశీ వెకేషన్ కు చెక్కేసాడు. తాజాగా మహేష్ వెకేషన్ ను ముగించుకుని ఇండియా తిరిగి రాబోతున్నాడట. వచ్చీ రాగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్లను తెలుసుకుంటారట. ఇప్పటికే SSMB 28 ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసిపెట్టిన త్రివిక్రమ్ జూలై మొదటి వారంలో మహేష్ కు వినిపిస్తాడట. మహేష్ ఓకే అంటే స్క్రిప్ట్ ను లాక్ చేసి వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు, డైలాగ్ రైటింగ్ ను సైమల్టేనియస్ గా కానిచ్చేస్తారట. ఒక్కసారి సెట్స్ పని ముగియగానే షూటింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రీకరిస్తారట. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందట. ఇక ఆ తదుపరి రాజమౌళి తో మహేష్ 29వ సినిమా ఉంటుందన్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa