కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త సినిమా ఈరోజు బెంగళూరులోని గవిపుర గుట్టహళ్లిలోని శ్రీ భాండేమహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ఈ సినిమాకి 'UI' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా కోసం ఉపేంద్ర దర్శకుడిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. స్టార్ యాక్టర్స్ కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, సలగ విజయ్ తదితరులు ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి క్లాప్‌ని కిచ్చా సుదీప్ అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ ఈ క్రేజీ మూవీని నిర్మించాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa