బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. తాజాగా ఈరోజు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఉందని ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నం మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ మరియు టైటిల్‌ను విడుదల చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa