ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఆలియాభట్, అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికీ ఆర్ ఆర్ ఆర్ థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డు లు దర్శనమిస్తున్నాయంటే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారో, ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందొ అర్ధమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా పదకొండొందల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటి లో సందడి చెయ్యబోతుంది. ప్రముఖ ఓటీటి సంస్థ జీ 5 లో ఈ నెల 20న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ జీ 5 ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అదే రోజున తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. అయితే, అదే రోజున తారక్ పుట్టినరోజు ఉండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa