పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రొడక్షన్‌ను పూర్తి చేసి రీరికార్డింగ్, ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. సినీ ప్రేమికులని అండ్ ప్రేక్షకులని ఈ పంచ్ ప్యాక్ ట్రైలర్ చాలా ఆకట్టుకుంటుంది. 'సర్కారు వారి పాట' థియేట్రికల్ ట్రైలర్ కి 24 గంటల్లో 27 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 1.2 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్, వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ నెలకొల్పిన రికార్డులను ఈ సినిమా ట్రైలర్ బ్రేక్ చేసింది. యూట్యూబ్‌లో ఈ సినిమా ట్రైలర్ ట్రెండింగ్ నెంబర్ వన్ గా ఉంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సముద్రఖని, నదియా, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa