బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. 'యువతను బిగ్ బాస్ కార్యక్రమం పెడదారి పట్టిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలో నేను హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశా. సమాజానికి చెడు సంకేతాలను అందిస్తున్న బిగ్ బాస్‌ను పూర్తిగా బ్యాన్ చేసే బాధ్యతను హైకోర్టు తీసుకోవాలి' అని నారాయణ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa