తొలి సినిమా కార్తికేయ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన దర్శకుడు చందూ మొండేటి. నిఖిల్ సిద్దార్థ్, స్వాతి జంటగా నటించిన ఆ చిత్రం 2014లో విడుదలైన పది ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో చేసిన ప్రేమమ్ ఫర్వాలేదనిపించుకున్నా సవ్యసాచి సినిమా బాగా బెడిసికొట్టింది. దీంతో కొంత విరామమిచ్చి ఫుల్ ఎనర్జీతో చందూ తిరిగొస్తున్నాడు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 తో చందూ సూపర్ హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చందూ మొండేటి కార్తికేయ 2 తర్వాత వెంటనే ప్రఖ్యాత గీతా ఆర్ట్స్ లో త్రిభాషా చిత్రాన్ని చేయనున్నట్టు తెలిపారు. చాలా స్పాన్ ఉన్న ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కూడా ఈ మధ్యనే పూర్తయ్యిందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని, తెలుగు,తమిళ, హిందీ భాషలలో విడుదలవుతుందని చెప్పుకొచ్చారు. సవ్యసాచి మూవీ రిజల్ట్ విషయం లో అసంతృప్తిని వ్యక్తపరుస్తూ చైతూ కి తప్పకుండా ఒక హిట్ ఇస్తానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa