దేశం తరఫున ఆడే క్రీడాకారులు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటారో తనకు సూర్మ చిత్రం ద్వారా తెలిసిందని నటి తాప్సీ తెలిపింది .ప్రముఖ భారతీయ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సందీప్ పాత్రలో దిల్జీత్ దొసాన్జ్ నటిస్తున్నారు. తాప్సి కథానాయిక. సినిమా మొత్తంలో తాప్సి ఎక్కువగా ఇండియన్ జెర్సీలో కన్పించనుందట. దీనిపై ఆమె మాట్లాడుతూ, ‘ ‘సూర్మ’ సినిమా కోసం ఇండియన్ జెర్సీ వేసుకున్నాను. జెర్సీని ధరించినప్పుడు దీని వల్ల కలిగే బాధ్యత, ఒత్తిడి గురించి తెలిసింది. మైదానంలో మన భారతీయ క్రీడాకారులు ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో..మన హాకీ టీంకు కంగ్రాట్స్. చాలా గర్వంగా ఉందని తెలిపింది. ఈ మూవీ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి షాద్ అలీ దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa