బిగ్ బాస్ సీజన్ 2 రోజుకి రోజుకి మరింత రసవత్తరంగా మారుతుంది. ఒకవైపు శని ఆది వారాలలో నాని తనదైన శైలిలో సందడి చేస్తుంటే, మిగతా రోజులలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తుంది. సోమవారంతో బిగ్ బాస్ సీజన్2 .. 23 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా, ఈ ఎపిసోడ్ మొత్తం ఎఫైర్‌లు, ప్రేమాయణాలు అంటూ పెద్ద చర్చలే జరిగాయి. ముందుగా భాను, దీప్తి, గీతా మాధురి, నందినిలు రాత్రి సమయంలో తేజూ.. సామ్రాట్, తనీష్.. దీప్తి సునయనల మధ్య ఏం రిలేషన్ షిప్ ఉందనే దానిపై ఆసక్తికర చర్చలు జరిపారు. ఇవి తేజస్వీ చెవిన పడడంతో భాను ఎదుట అందరికి తనదైన స్టైల్‌లో క్లాస్ పీకింది .
ఇక తనీష్, అమిత్ తివారీలని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్ వారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇద్దరు ఏదైన కథని అల్లి ఇంటిలో అందరి సభ్యులని నమ్మిస్తే హౌజ్ సభ్యులు అందరికి మంచి విందు ఏర్పాటు చేస్తానని బిగ్ బాస్ చెప్పారు. ఇక అప్పటికప్పుడు అమిత్, తనీష్‌లు కథ అల్లి , ఇదైతే అందరు పక్కాగా నమ్ముతారనే నిర్ణయానికి వచ్చారు. తనీష్, సునయన మధ్య ఏదో జరుగుతుందని , దాని గురించి ఇంటి సభ్యులందరు ఏదో రకంగా మాట్లాడుకుంటున్నారని, అదంతా కన్ఫెషన్ రూంలో ఉన్న టీవీలో చూపించినట్టు చెప్పాలని ఇరువురు డిసైడ్ అయ్యారు. వెంటనే పాత్రలలోకి లీనమైన తనీష్,అమిత్‌లు కన్ఫెషన్ రూం నుండి బయటకి వచ్చారు. తనీష్ సీరియస్ గా స్మోకింగ్ రూంకి వెళ్ళగా, అమిత్ ఇంటి సభ్యులని నమ్మించే ప్రయత్నం మొదలు పెట్టాడు. తనీష్, అమిత్‌ల ఓవర్ పర్‌ఫార్మెన్స్‌తో ఇంటి సభ్యులు ఏం జరిగిందో తెలుసుకోవాలని చూస్తారు. అప్పుడు అమిత్ కన్ఫెషన్ రూమ్‌లో ఏవో వీడియోలు చూపించారని.. అవి దేని గురించో మాత్రం తనను అడగొద్దు అంటూ బయట బాగానే కవర్ చేస్తాడు.
తనీష్ మాత్రం తమ గురించి ఇలా మాట్లాడుకోవడం అస్సలు బాగా లేదంటూ, భానుని టార్గెట్ చేసి నువ్వు ఏదైన ఉంటే నాకు చెప్పొచ్చుగా అని గట్టిగా అరుస్తూ సీక్రెట్ టాస్క్‌లో ఫుల్ మజాని పండించాడు. ఇక భాను వెళ్లి దీప్తి సునయనతో కాస్త డిస్కషన్ జరపడం, ఆ టైంలో దీప్తి ఎమోషనల్ కావడం , ఇక గీతా మాధురి, శ్యామల, దీప్తిలు ఒకవైపు ఈ విషయం గురించి డౌట్ పడుతూనే మరోవైపు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అమిత్ ని పదే పదే ప్రశ్నించడం.. అమిత్ వారిని నమ్మేలా చేయడంతో ఈ సీక్రెట్ టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. అయితే ఈ టాస్క్ ఒకవైపు కంటిన్యూ అవుతుండగానే బిగ్ బాస్ నుండి ఎవరెవరిని పంపించాలో వారి పేర్లని నామినేట్ చేయమని బిగ్ బాస్ ఇద్దరిద్దరిగా కన్ఫెషన్ రూంకి పిలుస్తారు.
మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారో ఇద్దరుగా చర్చించుకొని, అందుకు కారణం కూడా చెప్పాలని బిగ్ బాస్ అనడంతో ముందుగా వచ్చిన బాబు గోగినేని, గీతా మాధురిలు.. దీప్తి, తేజస్వి పేర్లను నామినేట్ చేస్తారు. ఆ తర్వాత రోల్ రైడా, తేజస్విలు.. కౌశల్, గణేష్ పేర్లను నామినేట్ చేశారు. గణేష్, నందినిలు.. తేజస్వి, కౌశల్ పేర్లను నామినేట్ చేశారు. దీప్తి, శ్యామలలు.. తేజస్వి, బాబు గోగినేనిల పేర్లను నామినేట్ చేశారు. భాను శ్రీ, సామ్రాట్‌లు.. కౌశల్, నందిని పేర్లను నామినేట్ చేశారు. సునైనా, కౌశల్‌లు.. గణేష్, శ్యామల పేర్లను నామినేట్ చేశారు. తనీష్, అమిత్‌లు.. గీతా మాధురి, కౌశల్ పేర్లను నామినేట్ చేశారు. సభ్యుల్లో ఎక్కువమంది కౌశల్, తేజస్వి పేర్లను నామినేట్ చేశారు. కౌశల్ సెల్ఫిష్ అని బాగా కాకా పడతాడని చెప్పారు. అలాగే హౌస్‌లో తేజస్విని ప్రవర్తన సరిగా లేదని.. గేమ్ మొత్తాన్ని ఆమె ఏదో నడిపిస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందంటూ సభ్యులు మండిపడ్డారు.
కౌశల్, తేజస్వీ తర్వాత ఎక్కువ మంది గణేష్ పేరుని నామినేట్ చేశారు. వ్యక్తిత్తం మంచిదే అయినప్పటికి టాస్క్‌లో సరిగా ప్రతిభ కనబరచలేకపోతున్నాడని ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక మరోసారి అమిత్, తనీష్‌లని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్ బాస్ వారికి కేక్ అందిస్తాడు. ఈ సీక్రెట్ టాస్క్‌ను ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్తారు . తనీష్ విందు గురించి ప్రస్తావించినా బిగ్‌బాస్ మాత్రం స్పందించలేదు. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన తేజస్వి, గణేష్, శ్యామల, నందిని,కౌశల్, బాబు గోగినేని, దీప్తి, గీతా మాధురి పేర్లను బిగ్ బాస్ చెప్పారు.
కిరీటి విసిరిన బిగ్ బాంబ్ స్వీకరించిన గీతా మాధురి బాక్సింగ్ గ్లౌజులు సరిగా ధరించుకండా, ఇంటి నియమాలని ఉల్లంఘించడంపై బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. అంతే కాదు ఎలిమినేషన్ గురించి హౌస్‌లో చర్చించొద్దని చెప్పినా వినకుండా.. నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడటంపై బిగ్ బాస్ కోపగించుకున్నారు. ఇంటి నియమాలను ఉల్లంఘించినందుకు గీతా మాధురిని జైల్లో పెట్టాలని ఆదేశించారు. అది కూడా చేతికి బాక్సింగ్ గ్లౌజులు వేసుకొని.. ఇంటి నియమాలను పాటిస్తాను బిగ్ బాస్ అంటూ వందసార్లు జైలు గోడలపై రాయాలని ఆదేశించడంతో ఎపిసోడ్ ముగిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa