ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసిన 'బీస్ట్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 10:22 AM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే నటించిన 'బీస్ట్' సినిమా 13 ఏప్రిల్ 2022న విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులు నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 'బీస్ట్' సినిమా కేవలం 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ఆఫీస్ వద్ద 100 కోట్లు సంపాదించింది. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా ట్విట్టర్‌లో ఇదే విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ మరియు ఇతరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని కళానిధి మారన్ నిర్మించగా, రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. తమిళనాడులో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది.
'బీస్ట్' తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్:::
తమిళనాడు - 37 కోట్లు
కర్ణాటక -7.50 కోట్లు
AP/TS – 8 కోట్లు
కేరళ - 6.50 కోట్లు
నార్త్ ఇండియా - 2 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa