మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సర్కారు వారి పాట". ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో జరిగిందనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ నైజాంలో రూ.30 కోట్లు, ఆంధ్రాలో రూ.50 కోట్లకు అమ్ముడుపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ.80 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa