ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిమానులను వేడుకుంటున్న రాశిఖన్నా

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 12:06 PM

సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశీ ఖన్నా వెంకీ మామ' తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం 'థాంక్యూ' చిత్రంలో నాగ చైతన్యకు జంటగా నటిస్తున్న భామ..పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోనూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో తాను సౌత్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవహేళనల గురించి వెల్లడించింది. దక్షిణాదిన తన టాలెంట్ కు తగ్గరోల్స్ రాలేదని వాపోయింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సౌత్ ఇండియన్ ఫ్యాన్స్... రాశికి వ్యతిరేకంగా నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రోపై తాజాగా స్పందించిన రాశి.. ట్విట్టర్ వేదికగా ఒక నోట్ షేర్ చేసింది. నేను ఏ సినీ పరిశ్రమను అవమానిస్తూ మాట్లాడలేదు. భాష ఏదైనా నేను చేసే ప్రతీ సినిమాపై నాకెంతో గౌరవం ఉంటుంది. దయచేసి నాపై అసత్య ప్రచారాలు ఆపండి' అంటూ పోస్టు చేసింది. కాగ రుద్ర' సిరీస్ సక్సెస్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రాశి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa