విభిన్న కథా కథనాలతో హీరోగా దూసుకుపోతున్న నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం 'అ!'. యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వదిలిన టీజర్, ఫస్ట్ లుక్స్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొంది సినిమాకు భారీ హైప్ తెచ్చిపెట్టాయి. చిత్రంలో నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పటికే చూసిన అనుపమ పరమేశ్వరన్ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘భయం, ఆశ్చర్యంతో కూడిన ఓ అద్భుతమైన రెస్పెక్ట్ నాకు రాత్రి అ! సినిమాను చూస్తుంటే కలిగింది. నిజంగా ఇన్‌స్పైర్ చేసే విధంగా ఒక కొత్త అప్రోచ్‌తో మంచి వాల్యూస్‌తో ఈ సినిమాను నిర్మించారు.’’ అని ట్వీట్‌లో అనుపమ పేర్కొంది. ఈ సినిమా రేపు(ఫిబ్రవరి 16)న విడుదల కానుంది.
Awe :a feeling of reverential respect mixed with fear or wonder.
Last night I experienced the same when I was watching #AWE .. truly inspiring... a new approach to cinema with good values.. @NameisNani @PrashantiTipirn @prasanthvarma good work
— Anupama Parameswaran (@anupamahere) February 15, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa