మహేశ్ ప్రస్తుతం ‘భరత్ అనే నేనే’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు బాలీవుడ్ బ్యూటీ కైరా అడ్వాణీ హీరోయిన్.తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ లో పంచుకుంది. ”తెలుగులో నేను నటిస్తున్న మొదటి చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమా కథ చెప్పగానే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. తొలి చిత్రం మహేశ్‌బాబుతో కావడం నా అదృష్టం మహేశ్‌బాబు టీం ప్లేయర్‌లాంటి వారు. సెట్స్‌లో సైలెంట్‌గా పంచ్‌లు వేస్తుంటారు. ఎంత అలసిపోయినవారైనా మహేశ్ ఉంటే రీఛార్జ్ అవుతారు” అని చెప్పుకొచ్చింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa