ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కనితన్’సినిమా లో నిఖిల్ సరసన నటించనున్న క్యాథరిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2018, 02:46 PM

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే నిఖిల్ ప్రస్తుతం ‘కిరిక్ పార్టి’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి మూడో వారంలో విడుదల కానుంది. ఈ మూవీ తరువాత నిఖిల్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘కనితన్’ ను తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నాడు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా నిర్మించబోతున్నారు.


ఈ ప్రాజెక్ట్ లో నిఖిల్ సరసన క్యాథరిన్ థ్రెస నటిస్తోంది. తమిళ్ కనితన్ సినిమాలో కూడా ఈ హీరోయిన్ నటించడం విశేషం. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సంతోష్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరిలో ఈ సినిమా మొదలు కావాలి, కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా వాయిదాపడింది. త్వరలో ఈ సినిమాకు సంభందించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa