అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ నటించిన తాజా చిత్రం హలో. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా నటించింది దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్. హలో మూవీ కళ్యాణికి తొలి మూవీ అయినప్పటికి ఎంతో మెచ్యూర్‌గా నటించింది. అయితే జనవరి 30 తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా హార్ట్ టచింగ్‌తో ఉన్న మెసేజ్‌తో బర్త్‌డే విషెస్ చెప్పింది కళ్యాణి. 'సెట్లో పనిచేస్తున్న ఆయనను చూస్తూ నేను పెరిగాను. తల మీద పెద్ద టోపీ, నల్ల కళ్లద్దాలు, సినిమాల గురించి నాకు పాఠాలు, మధ్యమధ్యలో యాక్షన్ అనే అరుపులు. ఇవాళ ఆయనకు 61 ఏళ్లు. అయినా ఏం మారలేదు. హ్యాపీ బర్త్‌డే అచ్చా! నువ్వు 90 గొప్ప సినిమాలు తీసుండొచ్చు... కానీ నువ్వు సృష్టించిన కళాఖండాల్లో ఉత్తమమైనది నేనేనని నా ఫీలింగ్' అని చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ కామెంట్ పెట్టింది. కళ్యాణి మెసేజ్‌కి తన తండ్రి ఎంత ఫీలయ్యాడో తెలియదు కాని, నెటిజన్స్ మాత్రం ఈ అమ్మడిని తెగ పొగిడేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ తప్పక అవుతుందని జోస్యం చెబుతున్నారు
I grew up on sets watching him at his best. Big hat. Dark glasses. Teaching me something about films and screaming ACTION on a mic. Now he’s 61! Nothing has changed. #happybirthday acha! You’ve made 90-something amazing films but I still think I’m your best creation yet pic.twitter.com/l9UaP1GNA4
— Kalyani Priyadarshan (@kalyanipriyan) January 30, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa