యంగ్ హీరో నిఖిల్.. బాయ్స్ అండ్ గార్ల్ గెట్ రెడీ ఫర్ ద పార్టీ అంటున్నాడు. ప్రస్తుతం తన 15వ చిత్రంగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో కిరాక్ పార్టీ అనే సినిమా చేస్తున్న నిఖిల్ జనవరి 31 సాయంత్రం 6.30ని.లకు మూవీ ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. కన్నడ హిట్ చిత్రం కిరిక్ పార్టీ రీమేక్ కాగా, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై ఈ మూవీ రూపొందుతుంది. యువ దర్శకులు సుధీర్ వర్మ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండగా, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తున్నాడు. సంయుక్తా హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లొకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వెరైటీ కథాంశంతో ఈ మూవీ రూపొందుతుండగా, ఈ సినిమా కూడా నిఖిల్ కి మంచి హిట్ అందిస్తుందని యూనిట్ భావిస్తుంది. స్టూడెంట్ లీడర్‌గా నిఖిల్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. కన్నడ సినిమా కిరిక్ పార్టీ బంపర్ హిట్ సాధించగా , పదిహేను సెంటర్లలో 150 రోజులను పూర్తి చేసుకుంది. అత్యధిక వసూళ్లను సాధించిన కన్నడ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరి తెలుగులో ఇది ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
Get Ready for the Partyyy
Gals nd Boys 31st evening Trailer from Our Movie #KirrakParty #KirrakPartyTrailer pic.twitter.com/a6O9C2rU9K
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 29, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa