క్రైమ్, మాఫియా కిక్ నుంచి బయటపడ్డ ఆర్జీవి.. ఇప్పుడు 'సెక్స్' కంటెంట్‌లో ఆ కిక్‌ను వెతుక్కుంటున్నారు. 'జీఎస్‌టీ'తో బహుశా డబుల్ కిక్ వచ్చిందేమో.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో 'జీఎస్‌టీ 2'కి కూడా సిద్దమైపోయారు. తన ట్విట్టర్ ఖాతా నుంచి వర్మ తాజాగా ఈ ప్రకటన చేశారు." 'గాడ్ సెక్స్&ట్రూత్'కు అద్భుతమైన స్పందన రావడంతో.. త్వరలోనే జీఎస్‌టీ-2 మొదలుపెట్టబోతున్నాను.ఆ భగవంతుడు నాతో పాటు నా జీఎస్‌టీ లవర్స్ వైపు ఉంటాడని ఆశిస్తున్నా' అంటూ వర్మ ట్వీట్ చేశారు.జీఎస్‌టీ-2 అంటూ ప్రకటించేశాడు కానీ.. ఇందులోనూ మియా మాల్కోవానే చూపించబోతున్నాడా?.. లేక మరో పోర్న్ స్టార్‌తో చేయబోతున్నాడా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా.. జనం వద్దన్న పని చేయడం వర్మకు కిక్ ఇచ్చే విషయం కాబట్టి.. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాల్ని ఆయన లెక్క చేయట్లేదు.'లక్ష పైచిలుకు మంది #గాడ్‌సెక్స్&ట్రూత్ పోల్ లో పాల్గొంటే.. అందులో 73శాతం మంది సినిమాకు అనుకూలంగా ఉన్నారు. దేవి గారూ వింటున్నారా..' అంటూ వర్మ కామెంట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa