ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ సినిమా పూజా హెగ్డే దగ్గర స్టాప్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2018, 04:10 PM

త్రివిక్రమ్ ఎన్టీఆర్ .. కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి  సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. ‘అజ్ఞాతవాసి’ పరాజయంపాలు కావడం వలన, ఈ ప్రాజెక్టులో ఆమెకి చోటు ఇవ్వడానికి త్రివిక్రమ్ అంతగా మొగ్గు చూపటంలేదంట‌. అయితే క‌థానాయిక‌ల‌లో..


కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన ఈ సినిమా టీమ్, పూజా హెగ్డే దగ్గర ఆగినట్టుగా సమాచారం. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్దే అయితే కొత్తగా ఉంటుందనీ .. పాత్ర పరంగా కూడా ఆమెనే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయాలు టీమ్ లో వ్యక్తమవుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్న ఈ సినిమాకి, అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. త్వ‌ర‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa