ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క ఏం చేస్తోందో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2018, 02:55 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ ప్ర‌స్తుతం ఎంబ్రాయిడ‌రీ నేర్చుకుంటోంది. ఎందుకు నేర్చుకుంటోంది అనుకుంటున్నారా? `సుయి ధాగా` అనే సినిమా కోసం. సినిమాలో పాత్ర‌ను స‌హ‌జంగా పండిచేందుకు కొంత‌మంది హీరోలు, హీరోలు కొన్ని ప్ర‌త్యేక విద్య‌లు నేర్చుకుంటుంటారు. ఎక్కువ‌గా హీరోలే అలాంటి పనులు చేస్తుంటారు. తాజాగా అనుష్క శ‌ర్మ కూడా ఇలా ప్ర‌త్యేకంగా ఓ సినిమా కోసం ఎంబ్రాయిడ‌రీ నేర్చుకుంటోంది.


 వ‌రుణ్ ధ‌వ‌న్‌, అనుష్క హీరోహీరోయిన్లుగా `సుయి ధాగా` సినిమా తెర‌కెక్కుతోంది. శ‌ర‌త్ క‌ఠారియా ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కోసం ఇటీవ‌లె వ‌రుణ్ మిష‌న్ కుట్ట‌డం నేర్చుకున్నాడు. ఇప్పుడు అనుష్క ఎంబ్రాయిడ‌రీ నేర్చుకుంటోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa