'సాహో' సినిమా ప్రభాస్ కి మిశ్రమ ఫలితాలు అందించింది. ఐతే అప్పట్లో ఈ మూవీ మ్యూజిక్ విషయంలో చిన్న వివాదం నడిచింది. సాహో మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న శంకర్, ఎహసాన్, లాయ్ లు మధ్యలో సినిమా వదిలేసి వెళ్లిపోయారు. సాహో నిర్మాతలు పూర్తి పాటలు కంఫోజ్ చేసే బాధ్యత వారికి ఇవ్వకపోవడంతో ఆ మ్యూజిక్ త్రయం ఈ నిర్ణయం తీసుకొని వెళ్లిపోవడం జరిగింది. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ విషయంలో కూడా ఇదే జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ త్రివేది ఎంపికయ్యారు. కారణం ఏమిటో గాని ఈ మూవీ నుండి ఆయన తప్పుకున్నారట. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa