కాజల్ కూడా సమంత బాటలోకి వచ్చేసింది అంటున్నారు నెటిజన్లు. తమిళనాట 'ఇండియన్ -2' తో పాటుగా తెలుగులో అల్లరి నరేష్ సినిమాలో నటిస్తున్న కాజల్.. ఇప్పడు మరో మహిళా దర్శకురాలితో ఓ కొత్త ప్రయోగం చేయబోతోంది. డాన్స్ మాస్టర్ బృంద దర్శకురాలిగా పరిచయమవుతున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీకి కాజల్ ఒకే చెప్పిందట.తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచే కంటెంట్‌తో రాబోతోందని అంటున్నారు. కథలోని కొత్తదనం నచ్చబట్టే కాజల్ ఈ సినిమాని ఓకె చేసిందట. మరి కాజల్ గ్లామర్ పాత్రలకు దూరమై ఇప్పుడు ఇలా ప్రయోగాత్మకమైన చిత్రాలకు ఓకె చెప్పడంతో, కాజల్ లో మార్పు వచ్చింది అనే వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa