విజయ గర్వం తలకెక్కినప్పుడు అదే వారి వినాశనానికి దారి తీస్తుంది.. ఈ విషయం చాలా మంది ప్రముఖుల విషయంలో నిజమైంది. అందుకే ఎంత ఎదిగినా కొంతమంది ప్రముఖులు ఒదిగి ఉండటానికే ఇష్టపడుతుంటారు. ఈ కోవలోకి చెందిన వారే మెగాస్టార్ చిరంజీవి. సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. మొదట హీరో తరువాత సుప్రీం హీరో ఆ తరువాత మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్ని దశాబ్దాలు గడిచినా ఆయన స్థానాన్ని ఎవ్వరూ పూరించలేరన్నది టాలీవుడ్ ఎరిగిన సత్యం. ఇదిలా ఉంటే దాసరి నారాయణరావు మరణం తరువాత చిరంజీవి టాలీవుడ్‌కు పెద్దన్నగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘మా’ను సరిదిద్దడంతో పాటు.. ఇటీవల విరివిగా చిన్న హీరోల ఆడియో ఫంక్షన్లకు వెళుతూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు చిరంజీవి. ఆ సమయంలో చిరంజీవిపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రశంసలు వచ్చిన ప్రతిసారి ఆయన ఇంటికి వెళ్లి నేలపై పడుకుంటారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఎవరైనా పొగిడితే సంబరపడిపోను. సినిమా వేడుకల్లో నన్ను పొగిడినప్పుడు.. ఇంటికి వెళ్లగానే నేలపై పడుకుంటా. ఎందుకంటే గర్వం రాకూడదు కదా. నా మూవీలు విజయం సాధించడం వెనుక నా ఒక్కడి గొప్పదనం మాత్రమే ఉండదు. దాని వెనుక ఎంతో మంది కళాకారులు, శ్రామికుల కష్టం ఉందని భావిస్తాను. ఇక సినిమా ఫెయిల్ అయినప్పుడు విమర్శలు వస్తే.. టీమ్ మొత్తం ఫెయిల్ అయ్యామనే నమ్ముతా. ఈ రెండు విషయాల్లో నేను నిజాయితీగా ఉంటాను కాబట్టే.. సక్సెస్, ఫెయిల్యూర్‌ను నేను ఒకేలా తీసుకుంటా’’ అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa